సంపన్న మహిళా సావిత్రి

Telugu Lo Computer
0


అనాది నుంచి ఆచార సంప్రదాయాల వల్ల కావొచ్చు వ్యాపార రంగంలో మహిళలు అతి తక్కువగా ఉంటారు. అంతే కాదు, మహిళలు వ్యాపారాలను సరిగా నిర్వర్తించలేరనే అపవాదులు కూడా అనేకం ఉన్నాయి. అయితే అవకాశాలు లభించినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తూనే ఉన్నారు. సావిత్రి జిందాల్.. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత సంపన్న భారతీయ మహిళ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఏళ్లపాటు గృహిణిగా ఉన్న ఈమె.. కేవలం ఏడాదిలోనే 9.72 లక్షల కోట్ల జిందాల్ వ్యాపారాన్ని మరో 3.34 కోట్లకు పెంచారు. ప్రస్తుతం సావిత్రి జిందాల్ ఆస్తుల విలువ 13.46 లక్షల కోట్లు. సావిత్రీ ఏ బిజినెస్‌ స్కూల్‌లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది మంది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్‌ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు. భర్త మరణం అనంతరం తొమ్మిది మంది పిల్లల్ని, వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆమె జిందాల్ గ్రూప్‌ చైర్ పర్సన్‌గా వచ్చాక, నిర్వహణ ఆమెకు సాధ్యం కాదని, త్వరలోనే జిందాల్ కనుమరుగవుతుందని అనుకున్నారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ అవతరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)