పునీత్ రాజ్ కుమార్‏కు తీవ్ర అస్వస్థత

Telugu Lo Computer
0


కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌  గుండెపోటు కు గురయినట్లు గా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి చిక్సిత్స అందిస్తున్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఆస్పత్రి లో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్ ఆరోగ్యం మరింత విష మించడంతో ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న నేపథ్యంలో గుండెపోటు వచ్చి నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను విక్రమ్‌ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)