భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.34 సమయంలో నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 17,634 వద్ద, సెన్సెక్స్‌ 378 పాయింట్లు పెరిగి 59,144 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాలను నమోదు చేస్తున్నాయి. బీఎస్‌ఈలో ఇండియా గ్లైకాల్స్‌, ఫినొలెక్స్‌ ఇండస్ట్రీస్‌, దివీస్‌ ల్యాబ్‌, నెల్కో లిమిటెడ్‌, పటేల్‌ ఇంజినీరింగ్‌ షేర్ల విలువ పెరగ్గా.. హెచ్‌ఐఎల్‌, సూర్య రోషన్‌ లిమిటెడ్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్ల విలువ కుంగింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీ నిక్కీ, హంకాంగ్‌ సూచీ హాంగ్‌సెంగ్‌, కొరియా సూచీ కేవోఎస్‌పీలు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్‌ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)