గోవల్కర్‌, సావర్కర్‌ పాఠ్యాంశాలు ఉండవు

Telugu Lo Computer
0


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, విద్యార్థి సంఘాల విమర్శలతో కన్నూర్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ గోపినాథ్‌ రవీంద్రన్‌ వెనక్కు తగ్గారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో భాగంగా ధర్డ్‌ సెమిస్టర్‌లో గవర్నర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఎంఎస్‌ గోవల్కర్‌, హిందూ మహాసభ నేత  సావర్కర్‌ పాఠ్యాంశాలు ఉండబోవని గురువారం స్పష్టం చేశారు. అయితే సిలబస్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత కొత్త పోర్షన్‌ కింద నాల్గవ సెమిస్టర్‌లో ఈ పాఠ్యాంశాలను బోధిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి గతంలో మాదిరిగానే సమకాలీన రాజకీయ సిద్ధాంతాలనే బోధించడం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో కాషాయీకరణను బలవంతంగా చొప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విజయన్‌, కొన్ని విద్యార్థి సంఘాల విమర్శలు చేయడంతో విసి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. స్వతంత్య్ర ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచిన నాయకులను.. రాష్ట్ర ప్రభుత్వం కీర్తించదని విజయన్‌ పేర్కొన్నారు. అయితే వారి పాఠ్యాంశాలను బోధించాలన్న వర్శిటీ నిర్ణయానికి కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ మద్దతు తెలిపారు. సావర్కర్‌, గోవల్కర్‌ గురించి తెలుసుకోకపోతే వారి భావజాలాన్ని ఏ ప్రాతిపదికన వ్యతిరేకిస్తామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)