ఖడ్గ మృగాల కొమ్ముల కాల్చివేత

Telugu Lo Computer
0

 

ప్రపంచ ఖడ్గమృగాల సంరక్షణ దినోత్సవం సందర్బంగా అస్సాం ప్రభుత్వం ఖడ్గ మృగాల కొమ్ములను దహనం చేసింది. కజిరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలోని బకాఖట్‌ కవాతు మైదానంలో 2479 కొమ్ములను కాల్చి వేసింది. ఆ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఖడ్గ మృగాల కొమ్ముల్లో ఔషదగుణాలు ఉన్నాయనే అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు అస్సాం ప్రభుత్వం వెల్లడించింది. చైనీయులు తమ సంప్రదాయ ఔషదాల తయారీలో ఖడ్గ మృగాల కొమ్ములనే ఉపయోగిస్తుండగా , వియాత్నంలో ఈ కొమ్ము కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తారు. ఈ కొమ్ములపై మూఢ నమ్మకాలు పెరగడంతో అంతర్జాతీయంగా వీటికి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఖడ్గ మృగాల వేట పెరగడంతో అస్సాం ప్రభుత్వం స్మగ్లర్లనుండి స్వాధీనం చేసుకున్న కొమ్ములను కాల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మూఢ నమ్మకాలు తొలగిపోయి ఖడ్గ మృగాల సంరక్షణ పెరిగేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)