మట్కా స్థావరంపై పోలీసుల దాడులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 12 September 2021

మట్కా స్థావరంపై పోలీసుల దాడులు


కర్ణాటక రాష్ట్రం లోని విజయనగర జిల్లా పరిధిలోని హడగలి తాలూకా హరపనహళ్ళి ఇటిగి పట్టణంలో మట్కా స్థావరంపై  డీసీఆర్‌బీ పోలీసులు దాడులు జరిపారు. రూ. 3.46లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన శేఖరప్ప అలియాస్‌ చంద్రశేఖర్‌ మట్కా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సైదుల్లా అదావత్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించారు. డీసీఆర్‌బీయూ డీవైఎస్పీ మల్లేష్‌ దొడ్డమని ఆధ్వర్యంలో బృందం మట్కా నిర్వహిస్తున్న స్థావరంపై దాడులు నిర్వహించారు. మట్కా నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను, మట్కా చీటీలను, రూ. 3.46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బోరగేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సతీష్‌, అలబనూరు హేమంత్‌ ఇళ్లపై దాడులు నిర్వహించామని వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మట్కా స్థావరంపై దాడిచేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment