గేదెపై వచ్చి నామినేషన్‌ !

Telugu Lo Computer
0

 


పంచాయతీ ఎన్నికలతో బిహార్‌ రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. ఇప్పటికే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్‌ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతున్న వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు. కఠియార్‌ జిల్లా హసన్‌గంజ్‌ పంచాయతీలోని రామ్‌పూర్‌ గ్రామస్తుడు మహ్మద్‌ ఆజాద్‌ ఆలం. ఓ పాడి రైతు. పాడి పశువులను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్‌ వేసేందుకు గేదెపై వెళ్లాడు. అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే.. 'పెట్రోల్‌ ధరల పెరుగుదల' కారణంగా చెప్పాడు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను' అని అభ్యర్థి ఆలం మీడియాకు తెలిపాడు. అయితే పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బిహార్‌లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 12న చివరి దశ జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)