డారియాకి ప్రేమతో... ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 13 September 2021

డారియాకి ప్రేమతో... !

 

యూఎస్‌ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. జకోవిచ్‌తో తలపడిన తుదిపోరులో డానిల్‌ 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే రోజు అతడికి మూడో వివాహ వార్షికోత్సవం కావడం కూడా గమనార్హం. ఈ సందర్భంగా గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అందుకునేటప్పుడు ఈ రష్యా ఆటగాడు తన విజయంలో సతీమణి డారియా సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని తెలిపాడు. ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటానని అన్నాడు. కాగా, అక్కడే ఉంటూ ఈ మాటలు విన్న డారియా భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 'నా భార్య డారియా ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ నాపై నమ్మకంతో ఉంటుంది. నేను టాప్‌ 10లో ఉంటానని అంటుండేది. ఒకవేళ నేను ఏదీ సాధించలేనని ఆమె చెబితే అందులో ఏదో లోపం ఉందని అర్థం. అలా తను నాకు పూర్తి మద్దతు ఇస్తుంది. తనంటే నాకెంతో ఇష్టం. డారియాతో ఉండాలంటే మరీ మరీ ఇష్టం. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. ఈ టోర్నీ జరుగుతున్నంత కాలం ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలనేదాని గురించి అస్సలు ఆలోచించలేదు. నేను ఫైనల్‌కు చేరాక.. ఒకవేళ ఇక్కడ ఓడితే ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. మరోవైపు నాకు వేరే సమయం కూడా లేకపోయింది. ఇది నాకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌గా అనిపించింది. తుదిపోరులో గెలిచాక మెద్వెదేవ్‌ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా కోల్పోయి ఉన్నట్టుండి కిందపడిపోయినట్లు నటించాడు. అయితే, అది కూడా ఒక సెలబ్రేషన్‌ అని, దాన్ని ఫుట్‌బాల్‌లో చేసుకుంటారని తెలిపాడు. ఇదివరకు వింబుల్డన్‌ గెలిస్తే ఇలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నట్లు అతనన్నాడు. అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడిలా చేసినట్లు వివరించాడు. 

No comments:

Post a Comment