దురదలు తగ్గాలంటే....!

Telugu Lo Computer
0


మలబద్ధకం ఉన్నవారికి ఆ చెడు సరిగా బయటకు పోక, తిరిగి శరీరంలో చేరి అది చివరకు బయటకు పోవడానికి చర్మంలో చేరుతుంది. చెమట సరిగా పట్టనివారికి ఆ చెడు చర్మంలో మిగిలిపోయి రకరకాల ఎలర్జీలను కలిగిస్తూ ఉంటుంది. కొందరికి దురదలు వస్తే, మరికొందరికి దద్దుర్లు వస్తాయి. కొందరికి పొక్కులుగా వస్తాయి. ఏదేమైనప్పటికీ అటు శరీరము, ఇటు చర్మం రెండూ శుభ్రం అయితేగానీ దురదలు తగ్గవు.

చిట్కాలు:- 

1) ప్రతి రోజూ స్నానానికి వెళ్ళేముందు దురదగా ఉండే భాగంలో నిమ్మరసం రాసుకుని 5, 10 ని॥లు ఆగి స్నానం చెయ్యడం మంచిది.

 2) స్నానం అయ్యాక దురదలు వచ్చే భాగంలో కొబ్బరినూనె రాసుకుంటే కొంత ఉపశమనంగా ఉంటుంది.

 3) మరీ దురదలు ఎక్కువగా ఉన్నవారైతే వారానికిరెండు సార్లు చర్మానికి నీటి ఆవిరి పట్టి, ఆ చెడును శుభ్రం చేసుకోవడం మంచిది.(స్టీమ్ బాత్)

 4) మంచినీరు 4,5 లీ॥ త్రాగితే రక్తం బాగా శుభ్రపడుతుంది. ఎలర్జీలను నీరు బాగా తగ్గిస్తుంది.

 5) మలబద్ధకం పూర్తిగా పోయేట్లు జాగ్రత్త పడాలి. 

6) రోజుకి 50 శాతం ఆహారం కేవలం పండ్లు, పండ్ల రసాలతో ఉంటే త్వరగా రక్తం మారి లోపల దోషాలు పోతాయి.

7) గోమూత్రం ఆర్క్ రోజూ రెండు పూటలా 20 ml, కప్పు గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగాలి.

తాజా గోమూత్రం ఆవు దగ్గర పట్టుకుని, దూది తీసుకొని దురదల మీద రాయండి

9) తాజా ఆవు పేడ, గోమూత్రం రెండూ కలిపి దురదల పైన వ్రాసి గంట ఆగి కడిగి వేయాలి.

10) తులసి ఆకులు, గరిక, వేప ఆకులు, పసుపు, మొత్తగా నూరి దురదలు దద్దుర్లు పైనా రుద్దాలి.

11) వాము, 10గ్రాములు, బెల్లం10 గ్రాములు కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి తిని నీళ్లు త్రాగాలి

Post a Comment

0Comments

Post a Comment (0)