పెరిగిన బంగారం ధరలు

Telugu Lo Computer
0


ఇన్నాళ్లు భారీ హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.438 పెరిగి రూ.46,214కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.45,776 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు రాత్రికిరాత్రే పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. వెండి ధరలు కూడా ఇవాళ బాగానే పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.633 పెరిగి రూ.62,140కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,507 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,802 అమెరికన్ డాలర్‌లు, ఔన్స్ వెండి ధర 23.79 అమెరికన్ డాలర్‌లు పలికింది. ఇదిలావుంటే హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.47,990 ఉండగా, 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.43,990గా ఉన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)