తల్లిదండ్రులపై కేసు పెట్టిన విజయ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 19 September 2021

తల్లిదండ్రులపై కేసు పెట్టిన విజయ్

 


బాల నటుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్. ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తల్లి శోభ. ఈమె సినీ గాయని, రచయిత. తాజాగా వీరిపై కేసు పెట్టాడు విజయ్. గత ఏడాది విజయ్ తండ్రి చంద్రశేఖర్  'ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' అనే పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆయన జనరల్ సెక్రెటరీగా, ఈయన భార్య శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. తనకు ఆ పార్టీతో  నేరుగాని, పరోక్షంగానీ  ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. తన నాన్న పార్టీ పెట్టారని, తన ఫ్యాన్స్ ఎవరిని కూడా అందులో చేరవద్దని కోరాడు. తన తల్లి తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫోటోలు ఉపయోగిస్తున్నారని అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. ఆయన పెట్టిన పార్టీపై తనకు ఎటువంటి సంబంధం లేదని.. పార్టీ విషయంలో తన పేరును వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ఇక ఈరోజు తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. ఇకపై తన పేరుతో ఎటువంటి కార్యక్రమాలు, రాజకీయ మీటింగులు నిర్వహించకుండా ఉండటానికే ఈ కేసు పెట్టానని తెలిపాడు. కోర్టులో ఈ కేసు పై సెప్టెంబర్ 27న విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad