ఫేస్‌బుక్‌లో పరిచయం......! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 September 2021

ఫేస్‌బుక్‌లో పరిచయం......!


ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభమ్ ఆగ్రాలో నివసిస్తూ పోటీ పరీక్షలను ప్రిప్రేర్ అవున్నాడు. కొద్ది నెలల క్రితం అతడికి ఫేస్‌బుక్‌లో ఓ బాలిక పరిచయమైంది. ఆ తరువాత వారు మరింత దగ్గరయ్యారు. నిత్యం ఒకరితో ఒకరు చాటింగ్ చేస్తూ రోజులు క్షణాల్లా గడిపేసేవారు. అయితే ఆమె ఉండేది రాజస్థాన్‌లోని జైపూర్. శుభమ్ ఉండేది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో. అతడు ఎప్పుడూ జైపూర్‌కు వెళ్లింది లేదు. దీంతో గూగుల్ మ్యాప్ సాయంతో అతడు జులై 15న జైపూర్‌కు వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన శుభమ్‌ను చూడగానే ఆమె సంబరపడిపోయింది. ఇదే అదనుగా శుభమ్.. ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటూ ఆమె ముందు హఠాత్తుగా  ఓ ప్రతిపాదన పెట్టాడు. ఆమె ముందూ వెనుకా ఆలోచించకుండా శుభమ్ కోరినట్టే.. అతడి వెంట వెళ్లేందుకు అంగీకరించింది. ఆ తరువాత.. ఆమెను తీసుకుని శుభమ్ ఆగ్రాకు చేరుకున్నాడు. అక్కడ ఒక అద్దె ఇంట్లో వారు దిగారు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలతో మభ్యపెట్టి లోబరుచుకున్నాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. మరోవైపు..బాలిక అదృశ్యమవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని జల్లెడపట్టిన పోలీసులు శుభమ్ ఆచూకీ గుర్తించారు. సెప్టెంబర్ 15న ఆగ్రాకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment