ట్రోయికా ప్లస్‌లో భారత్ అక్కర్లేదు : పాకిస్థాన్

Telugu Lo Computer
0


ఆఫ్ఘనిస్థాన్‌పై చర్చల బృందం (ట్రోయికా)లో భారత్‌ను చేర్చడానికి పాకిస్థాన్ విముఖత వ్యక్తం చేసింది. రష్యా, అమెరికా, చైనా, పాకిస్థాన్ ఈ ట్రోయికాలో ఉన్నాయి. దీనిని విస్తరించి భారత్, ఇరాన్‌కు చోటు కల్పించడంపై చర్చలు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ అన్నారు. రష్యాకు పాకిస్థాన్ రాయబారి షఫ్‌కత్ అలీ ఖాన్ ఓ రష్యన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ట్రోయికా ప్లస్‌లో చేరాలని ఇరాన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేరవచ్చునని తెలిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఇరాన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ట్రోయికా ప్లస్‌లో భారత్ చేరుతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్ చెప్పినట్లు తనకు తెలియదన్నారు. తమ విషయానికొస్తే, ట్రోయికా ప్లస్‌లో భారత్ ఓ క్యాండిడేట్ కాదన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)