70 కోట్ల టీకాలు వేశారు : మాండవీయా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 September 2021

70 కోట్ల టీకాలు వేశారు : మాండవీయా

 

కరోనా వైరస్‌ ని కట్టడి చేసేందుకుగాను ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా వేగంగా సాగుతుందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 కోట్ల టీకాలు ఇచ్చి రికార్డు సృష్టించామంటూ.. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్​సుఖ్ మాండవియా మంగళవారం వెల్లడించారు. కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టాలంటే టీకాతోనే సాధ్యమని.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడే మనం వైరస్‌ను ఓడించగలమని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దిగ్విజయంగా 70 కోట్లకు చేరుకుందంటూ మాండవీయా ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశలు వారిగా ఈ వ్యాక్సినేషన్‌​ ప్రక్రియ చేపట్టిందన్నారు మాండవియా. 'తొలుత మొదటి ఫేజ్‌ జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఫిబ్రవరి 2న బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు టీకా వేశారు. తదుపరి ఫేజ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను (45 ఏళ్లు నుంచి 60ఏళ్లు) మార్చి1న ప్రారంభించారు. తదనంతరం ఏప్రిల్‌​ 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికి టీకాలు వేశారు' అని మాండవియా తెలిపారు. 

No comments:

Post a Comment