రెండు ముక్కలైన లారీ..వీడియో వైరల్‌

Telugu Lo Computer
0

 

మన కళ్ల ముందే కొన్నిసార్లు వింత సంఘటనలు జరగడం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉండొచ్చు. ఇలాంటి దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ లారీ రోడ్డు ప్రమాదానికి గురై రెండు ముక్కలైనప్పటికీ.. లారీ చక్రాలు మాత్రం ఆగకుండా ముందుకు వెళ్లిపోయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. గానీ 14 సెకండ్ల వీడియోలో ఇద్దరు వ్యక్తులు బురద రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. పక్కన మరో రోడ్డు నుంచి ఓ లారీ ఈ రోడ్డు వైపు టర్న్‌ అయ్యింది. రోడ్డు బురదగా ఉండటంతో వెంటనే అదుపు తప్పి కింద పడిపోయింది. అది గమనించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నుంచి పక్కకు వెళ్లిపోయారు. అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. కింది చక్రాలన్నీ అలాగే ఉండి తిరిగి రోడ్డుపై అలా ముందుకు వెళ్లిపోయాయి. కిందపడిన లారీ నుంచి బతికి బయటపడిన డ్రైవర్ బయటకు వచ్చి.. వెళ్లిపోతున్న చక్రాలను చూసి వాటి వెనక పరుగు పెట్టాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని ట్రక్కుల భాగాలు రోడ్డుపై తిరుగుతూనే ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)