వాషింగ్ మెషీన్‌లో నాగుపాము

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లో దూరిన ఓ నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేద్దామని దాని డోర్‌ తెరవగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ వర్మకు సమాచారం ఇచ్చారు. అతడొచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)