ఆలిండియా అసెంబ్లీ స్పీకర్ల సదస్సు

Telugu Lo Computer
0


1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి వందేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా బుధవారం 81వ ఆలిండియా అసెంబ్లీ స్పీకర్లు అండ్‌ కౌన్సిల్ చైర్మన్ల సమావేశం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్‌ వి.నరసింహా చార్యులు తెలిపారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు ఆయా రాష్ట్రాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా రేపటి నుంచి రాజ్యసభ, లోక్ సభ టీవీ  లను కలిపి 'సంసద్' టీవీగా మార్చి ప్రసారాలను ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ విదానం ద్వారా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)