విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్రం మరో ముందుడుగు

Telugu Lo Computer
0



విశాఖ నగరంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్రం మరో ముందుడుగు వేసింది. లీగల్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ల నియామకానికి కేంద్రం చకచకా పావులు కదుపుతున్నది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కోసం 5 కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి. ఐదుగురిని కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్ లిస్ట్ చేసింది. ఈనెల 30న ప్రజెంటేషన్ ఇవ్వాలని 10 కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. లీగల్ లీగల్ అడ్వైజర్ కోసం ఢిల్లీకి చెందిన మూడు కంపెనీలతో పాటు గుర్గామ్, ముంబై కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి. వచ్చే నెల మొదటివారం నాటికి లీగల్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్లను ఖరారు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్ ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల డిజిటలైజ్ పనులను విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరింత వేగవంతం చేసింది. ఆగస్టులో లీగల్ అడ్వయిజర్ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)