అమెరికాలో అరుదైన గౌరవం

Telugu Lo Computer
0



భారత్‌కు చెందిన శరద్ వివేక్ సాగర్.. హార్వర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (హెచ్‌జీఎస్ఈ)కు సంబంధించిన స్టూడెంట్ కౌన్సిల్‌కు తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం శరద్ సాగర్‌తోపాటు మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా  సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 50 దేశాలకు చెందిన సుమారు 1200 మంది విద్యార్థులు శరద్ సాగర్‌ను స్టూడెంట్ కౌన్సిల్ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్‌గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన శరద్ సాగర్ సంతోషం వ్యక్తం చేశారు. శరద్ సాగర్ తన 16వ ఏటనే డెక్ స్టెరిటీ గ్లోబల్‌ను జాతీయ సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో అతను పోర్బ్స్ విడుదల చేసిన 30ఏళ్లలోపు అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు సంపాదించారు. 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు యంగ్ లీడర్లను శ్వేతసౌధానికి పిలిచి వారితో సమావేశమయ్యారు. భారత్ నుంచి ఈ సమావేశంలో శరద్ సాగర్ పాల్గొన్నారు. అదే సంవత్సరం నార్వేలో జరిగిన నోబెల్ పీస్ ప్రైజ్ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా శరద్ సాగర్ కు ఆహ్వానం కూడా వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)