కోర్టులో గ్యాంగ్ స్టర్ హతం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు హతమయ్యారు. ఓ కేసులో ఓ గ్యాంగ్ స్టర్ ను కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకురాగా అతని ప్రత్యర్థులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు. దాంతో గ్యాంగ్ స్టర్ మృతి చెందాడు. అయితే వారిపై పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఓ కేసులో జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టుకు తీసుకువచ్చారు. అక్కడికి అతని ప్రత్యర్థులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు. దాంతో జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ చనిపోయాడు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు .. మారువేషాల్లో వచ్చిన ఇద్దర్ని కాల్చి చంపారు.  వారిని టిల్లు గ్యాంగ్ వ్యక్తులుగా గుర్తించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా ఈ ఘటనపై మాట్లాడుతూ జితేందర్‌ను చంపేందుకు వచ్చిన వ్యక్తుల్లో ఒకరి తలపై నజరానా ఉన్నదన్నారు. అతన్ని పట్టిస్తే 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు. జితేంద్రను, అలాగే కుల్దీప్ ఫజా అనే ఇద్దరి నిందితులను రెండేండ్ల కిందట అరెస్టు చేశారు. అయితే కుల్దీప్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తం జీతేంద్ర నెట్ వర్క్ లో 50 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)