ఇంటి పేర్ల చరిత్ర...!

Telugu Lo Computer
0


చరిత్ర కాలంనుంచీ ఇంటి పేర్లు ఉన్న దాఖలాలు లేవు. ప్రజలు ఒకచోటినుండి మరో చోటికి వెళ్ళే అవసరం ఉండేదికాదు. అందుచేత కుటుంపెద్ద పేరుతో , గోత్రాన్ని అనుసరించి పిలుస్తూ ఉండేవారు.

మనకు శాతవాహనుల కాలం నుంచి ఇంటిపేర్లు ఉన్నట్లు సమాచారం. అడవి బాపిరాజు గారి అడవి శాంతిశ్రీ నవలలో అడవి స్కాందాయనక బ్రహ్మదత్త ప్రభువు పేరు వచ్చింది. అడవి అనేది వారి వంశనామం అయి ఉంటుంది. తరువాత నన్నయ కాలంలో ' పావులూరి మల్లన ' ఉన్నాడు. పావులూరి అనేది ఇంటిపేరు.

అయితే ప్రజల వలస పోవడం పొదలు పెట్టిన తర్వాత వారు ఏ ఊరినుంచి వచ్చారో అదే వారి ఇంటి పేరు అయింది. అందుకే వివిధ సామాజిక వర్గాలకి చెందినవారికి ఒకే ఇంటి పేరు ఉంటుంది.

ఇంకా వ్యక్తులు తాము ప్రచారం చేసే లేదా బోధించే అంశాలు రామాయణం, భారతం, భాగవతం , పురాణం, ద్వివేదుల, చతుర్వేదుల, వ్యాకరణం,లెక్కలు యజ్ఞాలు చేసిన వారు సోమయాజుల, నిర్వహించిన పదవులు ఉపాధ్యాయుల, మజుందారు, తాము కొలిచే దేవీ దేవతల పేర్లు శ్రీరాం, దుర్గా, మారుతి, దాశరథి, హరి, పంచభూతాలు, గాలి, అగ్ని, ఆకాశం, భూస్వరూపాలు పర్వతం, కొండ,మెట్ట, జలాశయాలు సముద్రం, కడలి, వాగు, వంక,చెరువు, శరీర భాగాలు పొట్ట, కాళ్ళు,ముక్కు, నోరు,గడ్డం, దంతాలు, పొట్టి, పొడుగు, మానసిక స్వభావాలు, పంతం, పొగరు, రాజసం,కేశ సంపద గిరిజా లు, మీసాలు,పిలక, ఆహార పదార్థాలు అన్నం,పెరుగు,చల్ల, వెన్న,

కూరగాయలు, పండ్లు, చెట్లు పేర్లు కూడా ఇంటి పేర్లు అయ్యాయి. కులాలు పంతులు, రాజు, కోమటి, రెడ్డి, నాయుడు, వడ్డెర, ఆయుధాలు కత్తి, బల్లెం, తుపాకులు, దిక్కు తూర్పు, తిధి ద్వాదశి, నక్షత్రాలు జ్యేష్ట, మూల ఇవన్నీ కూడా ఇంటిపేర్లే.

Post a Comment

0Comments

Post a Comment (0)