రూ.100 కే బంగారం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 29 September 2021

రూ.100 కే బంగారం !


బంగారం మీద భారతీయులకు ఉన్న ఈ మోజుని క్యాష్ చేసుకునేందుకు జువెలరీ కంపెనీలు ప్లాన్ చేశాయి. జువెలరీ కంపెనీలు మరో అడుగు ముందుకేశాయి. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పాయి. రూ.100కే బంగారం అందించే ప్లాన్స్ తో జువెలరీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. బంగారం ధరలు భగ్గుమంటున్నా ఈ పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు సిద్ధమవుతు న్నాయి. తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్‌ జువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. కంపెనీ వెబ్‌సైట్లలో లేదా ఇతర థర్డ్‌యాప్స్‌ ద్వారా విక్రయించే ఆఫర్‌లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్‌ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్‌ జువెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్‌కు కొత్తేమీ కాదు… పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి మొబైల్ వ్యాలెట్స్‌ డిజిటల్‌ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్‌ఫామ్ లు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్‌ గోల్డ్ ఆయా మొబైల్‌ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్‌ డైరక్టర్‌ కేతన్‌ కొఠారి తెలిపారు. దసరా, ధంతేరాస్‌, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్‌ జువెలరీ వర్గాలు తెలిపాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.

No comments:

Post a Comment