ఫిట్‌నెస్ పేరుతో అరాచకాలు

Telugu Lo Computer
0

 


హైదరాబాద్ లోని జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ పేరుతో జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దమ్మాయిగూడెంలో 9 ఫిట్‌నెస్ క్లబ్ పేరుతో నిఖిల్, చరణ్ అనే సోదరులు జిమ్ నిర్వహిస్తున్నారు. జిమ్‌కి వచ్చేవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో టార్గెట్ చేసి.. వారికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు జిమ్‌పై దాడి చేసి నిఖిల్, చరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎంతో మంది బాలికల జీవితాలతో చెలగాటమాడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)