ప్రతిభకు పేదరికం అడ్డుకాదు

Telugu Lo Computer
0


సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు ఎంతో మంది విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సంపాదించారు. అలాంటివారిలోనే ఒకరు ఉత్తర్ ప్రదేశ్ లోని శరన్ పుర్ కి చెందిన హ్యాపీ కుమార్.. ఈ కుర్రాడు ఆన్ లైన్ క్లాసుల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితేనేం.. సీబీఎస్ఈ పరీక్షల్లో అత్యద్భుతమైన మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్ చేయాలనే లక్ష్యంతో జెఇఇ మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులో ఉన్న ఆ పరీక్ష రాసి ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేయాలనేదే తన లక్ష్యం అని వెల్లడిస్తున్నాడు. సీబీఎస్ఈ పరీక్షల్లో 91 శాతం సాధించిన హ్యాపీ కుమార్. జెఇఇ  మెయిన్స్ మార్చి సెషన్ లో 96 శాతం సాధించాడు. తన మార్కుల గురించి మాట్లాడుతూ "నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. నాకు లాప్ టాప్ లేదు. దీంతో ఫోన్ ద్వారా క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. నెట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. " అని వెల్లడించాడు. స్కూల్స్ మూతబడి ఉండడం, నెట్ వర్క్ పెద్దగా లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోవడం వంటి వల్ల హ్యాపీ కుమార్ చాలా బాధపడ్డాడు. యూట్యూబ్ లో క్లాసులు విని దాని ప్రకారం తన వీలును బట్టి చదువుకునేవాడట. "మా స్కూల్ వారు శని, ఆది వారాల్లో జెఇఇ  కోసం క్లాసులు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఆ క్లాసులు కూడా మూతబడ్డాయి. అందుకే నేను సొంతంగానే చదువుకోవడం ప్రారంభించాను. యూట్యూబ్ లో ఆన్ లైన్ లెసన్స్ ఉంటే వాటిని వినేవాడిని. దీంతో పాటు అన్ అకాడమీలోని కొన్ని ఫ్రీ కోర్సులను కూడా చేశాను. వీటి ద్వారా నేను సులువుగా నా పరీక్షలతో పాటు జెఇఇకి కూడా సిద్ధం కాగలిగాను." అని వెల్లడించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)