తాలిబన్ల తొలి ఫత్వా జారీ

Telugu Lo Computer
0

 




ఆప్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తొలి ఫత్వా జారీచేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావేలేదని, అంతా షరియత్‌ చట్టాల ప్రకారమేనని ఇప్పటికే కరాఖండిగా తేల్చి చెప్పిన తాలిబన్లు ఆవైపుగానే నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులలకే తాలిబన్లు ఈ ప్రకటన చేశారు. హెరాత్ ప్రావిన్స్‌లో తాలిబాన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువు కోవడాన్ని నిషేధించారు. అంతేకాదు 'సమాజంలోని అన్ని దుర్మార్గాలకు మూలం' అని వర్ణించడం గమనార్హం. వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు తాలిబన్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)