మాస్కులు లేకుండా గుమిగూడటం ఆందోళనకరం

Telugu Lo Computer
0


ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కరోనా నిబంధనలను సరిగా పాటించడంలేదని, హిల్ స్టేషన్స్‌, మార్కెట్‌లలో ఫేస్ మాస్కులు లేకుండా జనం భారీ సంఖ్యలో గుమిగూడటం ఆందోళనకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడుతూ..దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే మనం మహమ్మారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. థర్డ్ వేవ్ కోవిడ్ కేసులను నివారించడానికి ప్రాథమిక నియమాలకు కట్టుబడి ఉండవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బహిరంగంగా ఉన్నప్పుడు ఫేస్ మాస్క్‌లు ధరించడం, పెద్ద సమావేశాలకు దూరంగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి విషయాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)