ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్

Telugu Lo Computer
0

Transgenders in India may soon get reservation in education under OBC quota  | Business Standard News

ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ జెండర్లకు 1 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. రిజర్వు కానిస్టేబుల్, బ్యాండ్స్‌మెన్ ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై సంగమ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌పై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ… రిజర్వేషన్ల విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒకశాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. దీనిపై రాష్ట్ర ధర్మాసనం స్పందిస్తూ ట్రాన్స్‌జెండర్ల కోటా విషయంలో కేంద్రం ఎటువంటి నిబంధనలు అమలు చేయబోతోందో రెండు వారాల్లోగా చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. కాగా..ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించటానికి…అమలు చేయటానికి 1977 లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ (రూల్స్) కు సవరణలు చేసినట్లు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా , జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ల డివిజన్ బెంచ్ కు సమాచారం ఇచ్చింది ప్రభుత్వం.

Post a Comment

0Comments

Post a Comment (0)