ఆరు రాష్ట్రాలకు కోవిడ్ కంట్రోల్ బృందాలు

Telugu Lo Computer
0


కోవిడ్ అదుపు చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను హుటాహుటిన పంపినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్‌ రాష్ట్రాలకు ఈ బృందాలు తరలివెళ్లాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న సమాచారంతో ఈ బృందాలను రాష్ట్రాలకు పంపినట్టు పేర్కొంది. ''రాష్ట్రాలకు వెళ్లిన ద్విసభ్య అత్యున్నత స్థాయి బృందాలలో ఒక క్లినీషియన్, పబ్లిక్ హెల్త్ నిపుణుడు ఉన్నారు. కోవిడ్ చర్యల అమలు జరుగుతున్న తీరును వీరు పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ తదితరాలను సమీక్షిస్తారు. పరిస్థితిని సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలను సూచిస్తారు'' అని ఆరోగ్యం మంత్విత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని అంచనా వేసి, ప్రజారోగ్య పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాయని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)