వరుడి కోసం వంతెన కట్టేశారు!

Telugu Lo Computer
0

 


బీహార్‌లోని అరరియాలోని ఫుల్సర గ్రామానికి చెందిన  బతేష్ తన కుమార్తె రాఖీ కుమారిని ఫోర్బెస్గంజ్ బ్లాక్ లోని రామాయి గ్రామానికి చెందిన అమరేంద్రకు ఇచ్చి వివాహం చేయనున్నాడు. పెళ్లి తేదీ వరకు అన్ని పనులు ఉత్సాహంగా చేశారు. కాని వధువు తరపు వారికి ఓ అసంతృప్తి మిగిలిపోయింది. వరుడిని అతడి బంధు మిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం. తమ ఇంటిలోనే తమ ఆడబిడ్డకు వివాహం చేయాలి. దీంతో గ్రామంలో పెద్దలంతా కూర్చుని చర్చించారు. వెదురు వంతెన నిర్మిస్తే బెస్ట్ అని నిర్ణయించారు. అతే..అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే వంతెన కట్టేశారు. ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కట్టారు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెనపై చక్కగా వచ్చి పెళ్లి చేసుకుని కోడలిని అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ పెళ్లికి గతంలో లాగా కాకుండా  చాలామంది బంధువులు హాజరయ్యారు.  దీంతో హుషారుగా ధూమ్ ధామ్ గా పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి పంపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)