ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా!

Telugu Lo Computer
0



పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మంచు విష్ణు అన్నారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్‌ భవనాన్ని తాను, తన కుటుంబ సభ్యులం కట్టిస్తామని తెలిపారు. మద్రాసులో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ద్వారా తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా ఉంటూ చాలా మంచి పనులు చేశారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడ పెద్దలందరూ కలిసి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. నాన్నగారు పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలబడ్డారు. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నామని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)