సోలార్ సైకిల్

Telugu Lo Computer
0



మధురైకి చెందిన ధనుష్ కుమార్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఎప్పుడు ఏదో కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టాడు. రెండు సోలార్ ప్లేట్లను కొనుగోలు చేసి వాటిని సీటు వెనక భాగంలో అమర్చాడు. సోలార్ ప్లేట్ల నుండి వచ్చే విద్యుత్ ను ఓ బ్యాటరీకి అనుసంధానించాడు. ఒక్కసారి బ్యాటరీ ఛార్జి అయితే సైకిల్ 50 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.కిలోమీటరుకు 1.5రూ మాత్రమే ఖర్చవుతుందని ధనుష్ కుమార్ చెబుతున్నాడు. తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో సైతం సైకిల్ పై 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. అతను రూపొందించిన సైకిల్ ను చూసిన అతను చదివిని స్ధానిక అమిరికన్ కళాశాల అధ్యాపకులు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతన్న నేపధ్యంలో ధనుష్ కుమార్ తరహాలోనే విన్నూత్న ఆలోచనలతో ముందుకు రావాలని అకాంక్ష అందరిలో వ్యక్తమౌతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)