శ్రీవారి హుండీలో విదేశీ నోట్లు !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు  శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. వెంకన్న అంటే ఠక్కున గుర్తుకొచ్చేది తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు. ఆదాయపరంగా  శ్రీవారి హుండీ. తిరుమల శ్రీవారి హుండీకి కుల మత, దేశ విదేవీ బేధాలు లేకుండా. ఎంతో మంది ఆయనను దర్శించుకుంటుంటారు. వెంకన్నను దర్శించుకుని శ్రీవారి హుండీలో కానుకలు వేస్తుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. బంగారం,వెండి, వజ్రాలు, వైఢూర్యాలు, ప్లాటినం, నగదు ఇలా ఎన్నో ఆయన హుండీలో వచ్చి చేరుతుంటారు. అలా వచ్చిన వాటిలో స్వదేశీ కరెన్సీ యే కాకుండా విదేశీ కరెన్సీ  కూడా భారీగానే  ఉంతుంది.  శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. వీటిలో పాకిస్థాన్ కరెన్సీ కూడా ఉండటం విశేషం. విదేశీ కరెన్సీ విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం రాగా, ఆ తరువాత స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. అమెరికా డాలర్లు 16 శాతం ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది విదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)