చాలా కష్టాల్లో ఉన్నారు: మధు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 16 July 2021

చాలా కష్టాల్లో ఉన్నారు: మధు


పోలవరం నిర్వాసితులు చాలా కష్టాల్లో ఉన్నారని సీపీఎం నేత మధు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. తహసీల్దార్ అనుమతి లేకుండా ఉరి నుంచి బయటికి రావొద్దన్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఇది మీ రాజ్యమా? అని ప్రశ్నించారు. అఖిలపక్షానికి సీఎం  జగన్ ను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా.. విహారయాత్రకు కేంద్ర బీజేపీ నేతలు వస్తున్నారా? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. వాళ్లు తిరగాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీ పెద్దల్ని కలవాలని సూచించారు. ఈ నెల 14న పోలవరం వస్తానన్న జగన్ రాలేదని, నిర్వాసితులకు ఇళ్లు కట్టకపోతే వారు ఎక్కడ ఉండాలి? అని రామకృష్ణ ప్రశ్నించారు.

No comments:

Post a Comment