సామెతలు .....!

Telugu Lo Computer
0





* కొండ నాలికను మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందంట !

* కూతురు కనలేకపోతే, అల్లుడి మీద పడి ఏడ్చినట్లు !

* కోళ్లను తింటారా అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు !

* గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట !

* గాలికిపోయిన పేలపిండి భగవదర్పితమన్నట్లు !

* చస్తానని చద్దన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందంట !

* చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు !

* చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద !

* చుట్టురా శ్రీ వైష్ణవులే చూస్తే కల్లు కుండ లేదు !

* చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు !

* గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది!

* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట !

* కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

* కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగాని, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా !

* కింద పడినా, మీసాలకు మన్ను కాలేదన్నట్లు !



 


 


Post a Comment

0Comments

Post a Comment (0)