15 ఏళ్ల బంధానికి స్వస్తి !

Telugu Lo Computer
0


బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమీర్ ఖాన్ - కిరణ్ రావ్‌లు విడిపోతున్నట్లు, కుమారుడిని మాత్రం కలిసి పెంచనున్నట్లు తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేశారు. 

"ఈ 15 అందమైన సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం ఇంకా ఎన్నో నవ్వులను పంచుకున్నాము. ఇప్పుడు మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ఇకపై మీము భార్యాభర్తలుగా ఉండడం లేదు. కానీ సహ తల్లిదండ్రులుగా ఉండబోతున్నాము. విడాకులకు సంబంధించి మేము కొంతకాలం క్రితం ఒక ప్రణాళికను వేసుకున్నాము. దాని ప్రకారమే ఈ తాజా నిర్ణయాన్ని తీసుకున్నాము. అయితే మేము మా కుమారుడు ఆజాద్‌ను మాత్రం మేము కలిసి పెంచుకుంటాము. అంతేకాదు మేము సినిమాలు, పానీ ఫౌండేషన్ ఇంకా ఇతర ప్రాజెక్టులపై కూడా కలిసి పని చేస్తూనే ఉంటాము. ఈ విషయంలో మీ ఆశీర్వాదాలు కావాలనీ అభ్యర్థిస్తున్నాము.. ధన్యవాదాలు.. ప్రేమతో కిరణ్, అమీర్ అంటూ లేఖలో పేర్కోన్నారు."

Post a Comment

0Comments

Post a Comment (0)