యువ డాక్టర్ల స్పూర్తి!

Telugu Lo Computer
0

 

డాక్టర్ ఫయిజా అంజుం, డాక్టర్ సావిత్రి దేవి ఇద్దరు వైద్య శాస్త్ర పట్టభద్రులు. అపోలో ఆసుపత్రి, సికింద్రాబాద్ లో పని చేస్తున్నారు. రాత్రిపూట ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి అచేతనంగా రోడ్డుపై పడి ఉన్నాడు. అతని చుట్టూ మంది గుమిగూడి సెల్ఫోన్లలో చిత్రీకరిస్తు న్నారు కాని ఎవరూ సహాయం అందించడం లేదు. అతని పల్స్ కూడా నామ మాత్రంగా, క్లిష్టంగా ఉంది. అక్కడున్నవారి అతను చనిపోయాడనే భావించారు. అంబులెన్సుకు ఫోన్ చేసినా అది చేరుకోలేదు. ఇది గమనించిన ఆ యువ డాక్టర్లు వెంటనే రోగిని పరిశీలించి ఓ పెన్ ఉపయోగించి గొంతు నుండి శ్వాస అందేలా చేశారు. వారి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి ఎలాంటి పరికరాలు లేకున్నా, ఒక న్యూస్ పేపర్ ఉపయోగించి అతని ఊపిరితిత్తుల్లోకి గాలిని నింపి శ్వాసను పునరుద్దరింపజేసే పని చేసారు.  చాతీని కూడా ఒత్తారు. 25 నిమిషాలకు అంబులెన్స్ వచ్చింది. ఆక్సీజన్, సెలైన్ ఎక్కించారు. ఆ తర్వాత అతని గుండె పూర్తి స్థాయిలో పని చేసింది. ఇలా యువ డాక్టర్లు ఫయిజా అంజుం, సావిత్రి దేవిలు స్పూర్తిని నింపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)