ప్రపంచ బైసికిల్ దినం!

Telugu Lo Computer
0


ఈరోజు ప్రపంచ బైసికిల్ దినం. సైకిలింగు ఆరోగ్యానికి ఏంతో  ప్రయోజనకారి. సైకిల్ తో ప్రపంచ యాత్ర చేసిన వారు చాలా మంది  ఉన్నారు. పెట్రోల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంట్టుతున్న ఈ రోజుల్లో సైకిల్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. విదేశాలలో  సైకిలింగు వ్యాయామ ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. దేనికి పెట్రోలు ఖర్చులేదు, వాయు కాలుష్యం లేదు, మన పల్లెటూళ్ళలోనే సైకిళ్ళు చూస్తాం. కొన్ని పురోగమిస్తున్న దేశాల్లో సైకిలుని వాడుతున్నారు. పూర్వం హీరో సైకిలుందంటె చాలా గొప్ప.

      హీరో సైకిలంటె మా రోజుల్లో మొనగాడు.దానిమీద సింహాసనం మీద కూర్చున్న ఫీలింగు వుండేది కొందరికి. అందరికి క్రేజీగా వుండేది.

    ఇక్కడ సైకిళ్ళు వాడకంఎక్కువ.పనులమీదవెళ్ళే  ఆడ మగవారు,సామానులు మోసుకెళ్ళే వారు. అచ్చమైన సైకిలిష్టులు పదిమందున్నారు.వీకెండ్సలో చేసేవారు,మాముందు నాలుగురోడ్లు పరుగు తీస్తుంటయి.పావుగంట గమనించానా ఏభైఐదు సైకిళ్ళు లెక్కించాను ఈరోజు. ఇది శుభసూచకం గదా. వాయు కాలుష్యం కొంతైన తగ్గుతుందిగదా.

   ఇంక సాయంత్రమైతే బిలాబిలా పిల్లల సైకిళ్ళు పార్కులో పార్కుజేసి ఆటలకు పరుగులు.

   మాచిన్నతనం లో అల్లుళ్ళకి సైకిలిచ్చెవారు గొప్పగా. తరువాత మధ్యతరగతి వారి అవసరాలకు, స్కూలుపిల్లలకు దొరికినయి.ఉద్యోగస్తులూ వాడడం,

    పోస్టు అనగానే మనకు సైకిలు మీదవచ్చే  వ్యక్తే కనిపిస్తాడు. స్కూటీలు, స్కూటర్ లు మోటార్ సైకిళ్ళులొచ్చి అన్నింటిని తోసిరాజన్నాయ. 

తిరిగి పాత రోజులు వస్తున్నట్లు అనిపిస్తుంది!

Post a Comment

0Comments

Post a Comment (0)