పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ!

Telugu Lo Computer
0


బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావు నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యఓడు కె. కేశవరావు అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ''పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ''ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కోర్ కమిటీ, పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని నిపుణులతో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఉప కమిటీలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రభుత్వ సలహాదారు- సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు, పీవీ నరసింహారావు కూతరు శాసన మండలి సభ్యురాలు సురభి వాణి దేవి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు- పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల ప్రత్యేక అధికారి మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉన్నారు. వీరి పర్యవేక్షణలో దాదాపు సంవత్సర కాలపు కృషితో ఈ పుస్తకాలు వెలుగు చూశాయి. ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. ప్రస్తుతం 8 పుస్తకాలను ప్రచురించినట్టు తెలిపారు. వాటిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు ఉన్నాయని చెప్పారు. జూన్  28న పీవీ జ్ఞానభూమిలో జరిగే పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరణ చేయనున్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)