బ్రిటన్ లో జంక్‌ఫుడ్ ప్రకటనలపై నిషేధం

Telugu Lo Computer
0


ఇటీవలి కాలంలో పిజ్జాలు, బర్గర్లు, హాట్‌డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీములు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్ తినడం అలవాటుగా మారింది.  ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన ఈ ఫుడ్ పల్లెపల్లెల్లోకి వచ్చేసింది. ఒంటికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటి పదార్థాలు ఎక్కువగా ఉన్న వీటిని తిన్న చిన్నారులు వయసుకు మించిన బరువు  పెరుగుతుంటే, పెద్దలేమో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ఊబకాయానికి, పలు అనారోగ్యాలకు జంక్ ఫుడ్ తినడమే కారణమని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

బ్రిటన్ లో తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం హైస్కూల్ చిన్నారులలో ప్రతి  ముగ్గురిలో  ఒకరు అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది. ఇంగ్లాండ్‌లోని పెద్దలలో మూడింట రెండొంతుల మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ విధానాన్ని  ప్రకటించింది. అయితే పాడ్‌కాస్ట్‌, రేడియో వంటి ఆడియో మీడియా ద్వారా జంక్‌ఫుడ్ ప్రకటనలు ఇప్పటికీ అనుమతి ఉండగా, బిల్ బోర్డులు, పోస్టర్ సైట్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రదేశాల్లోనూ వీటికి ఈ పరిమితులు వర్తించవు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌, టీవీలో ఏటా అన్ని ఆహార ప్రకటనలపై బ్రాండ్లు 600 మిలియన్లకు పైగా ఖర్చు చేస్తుంటాయి. ఈ నిబంధనలతో వాటిపై ప్రభావం పడనుంది. ఉత్పత్తుల జాబితా, నిషేధానికి సంబంధించిన విషయాలు రెండు మూడు సంవత్సరాలకు ఓసారి సమీక్షించనున్నారు. ఈ ప్రకటనలను రాత్రి 9 గంటల ముందు ప్రసారం చేయకూడదంటూ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)