కేసీఆర్‌ది కాలక్షేప పర్యటన !

Telugu Lo Computer
0


కేసీఆర్‌ ఆయన పర్యటనలు కాలక్షేపానికే తప్పా, వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని, సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు. ఈ పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా, అరెస్టులు, వేధింపులు తప్పడం లేదని బీజేపీ నేత విజయశాంతి మరోమారు కేసీఆర్పై  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  కేసీఆర్ పర్యటనలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ప్రజలను రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఇంత నిర్బంధం ఉంటుందంటే దానికి బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్ష నాయకులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. పేరుకే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప కేసీఆర్ పర్యటన వల్ల ప్రజలు, నిరుద్యోగులకు ఒరిగేది ఏమిలేదన్నారు.

Tags

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)