ఫేస్‌బుక్‌ బులెటిన్‌ సేవలు !

Telugu Lo Computer
0


ప్రముఖ రచయితలతో న్యూస్‌లెటర్స్‌ రాయించి వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన రచయితలను ఫేస్‌బుక్‌ వేదికపైకి ఆకర్షించేందుకు దీనిని ప్రారంభించింది. వీరు రాసే న్యూస్‌ లెటర్స్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలకు ‘బులెటిన్‌’ అని పేరుపెట్టింది. ఈ న్యూస్‌ లెటర్స్‌ ద్వారా ఆయా రచయితల ను, పాఠకులను ఈ వేదికపైకి తీసుకురావాలన్నది ఫేస్‌బుక్‌ ప్రణాళిక. ‘‘సృజనాత్మకమైన పనితీరు ఉన్నలక్షల మందికి సాయం చేయడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించాం. జర్నలిస్టులు వారి పాడ్‌కాస్ట్‌లను కూడా ఫేస్‌బుక్‌ ఆడియో టూల్స్‌ వాడి ప్రమోట్‌ చేసుకోవచ్చు’’ అని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. న్యూస్‌లెటర్స్‌ మీడియా పరిశ్రమకు కొత్తకాదు. ఇటీవల న్యూస్‌లెటర్స్‌పై దృష్టిపెట్టిన సబ్‌స్టేక్‌,రెవ్యూ వీటిల్లో మార్పులు తీసుకొచ్చాయి. అంతేకాదు, వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ వంటివి వీటిని ప్రయోగాత్మకంగా చేపట్టాయి. సబ్‌స్టేక్‌ వేగంగా వృద్ధి చెందడాన్ని గమనించి ఫేస్‌బుక్‌ ఈ దిశగా అడుగులు వేసింది. ట్విటర్‌ కూడా ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ది టైమ్స్‌ పత్రిక పేర్కొంది. తాజాగా బులెటిన్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకొంటే మెయిల్స్‌కు న్యూస్‌ లెటర్స్‌ వస్తాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)