గోరుచిక్కుడు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


* రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అవసరమయ్యే ఆహారంలో లభించే ఫైబర్ ను గోరుచిక్కుడు కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించే శక్తి ఈ గోరుచిక్కుడు ఉంది.

* ఇందులో లభించే కాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అంతేకాదు దంతాలకు,ఎముకలకు కావలసిన తగిన కాల్షియం కూడా ఈ గోరుచిక్కుడు వల్ల లభిస్తుంది.

* రక్తహీనతను తగ్గించి, రక్తప్రసరణను పెంచుతుంది.

* యాంటీ బయోటిక్ అయిన విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరిగి, ఫ్లూ బారిన పడకుండా ఉంటాము.

* ఉడికించి తినటం వల్ల వీటిలో ఉండే ఫోలేట్, పొటాషియమ్, ఫైబర్ వంటి పోషకాలు తగిన మోతాదులో శరీరానికి లభిస్తాయి.

* శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించి గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది.

*  మెదడును ఉత్తేజపరిచి, మతిమరుపు లేకుండా చేయడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

* ప్రతిరోజు జిమ్, ఎక్ససైజ్, మజిల్ ఇంప్రూవ్ చేసుకునేవారికి ఈ గోరుచిక్కుడు ఎంతగానో సహాయపడుతుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)