మన్యంలో సిగ్నల్ కరువు !

Telugu Lo Computer
0


ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. గిరిజన ప్రాంతాల్లో నేటికి ఫోన్ సిగ్నల్ సదుపాయాలు కరువు. ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా, నగదు లావాదేవీలైనా, అత్యవసర వేళల్లో ఎవరితోనైనా మాట్లాడాలన్న, వైద్య సాయం అందాలన్న, చేతిలో మొబైల్ ఉంటేనే పని జరిగేది. ఫోన్ దగ్గరే ఉన్నా..అటు ప్రభుత్వ సిబ్బందికి, ఇటు ప్రజలకు కూడా సరిగా సిగ్నల్స్ లేకుంటే పని ముందుకు సాగదు. అదిగో.. ఆ అవస్థకు అద్దమే ఈ దృష్యం. డుంబ్రిగుడా, సొవ్వ పంచాయతీ కమలబంధ గ్రామానికి చెందిన గిరిజనులంతా ప్రభుత్వ పథకాలు పొందేందకు అవసరమైన ఆన్లైన్ నమోదుకు వెళ్లి సెల్ సిగ్నల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సొవ్వ, గసబ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతం గిరిజనులు కోరుతున్నారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)