కాంచీపురం

Telugu Lo Computer
0


దక్షిణ భారత దేశంలో ఉన్న అత్యద్భుత మోక్షదాయక క్షేత్రం కాంచీపురం. జీవితకాలంలో తప్పక దర్శించవలసిన అద్భుత క్షేత్రం. కాంచీపురం లో పుట్టడం, మరణించడం పూర్వజన్మ సుకృతం. కాంచిపుర క్షేత్రం గురించి గాని , కామాక్షి అమ్మవారి గురించి గాని కేవలం క్షణకాలం ధ్యానించినా మన తాపత్రయాలు అన్ని పోయేలా అనుగ్రహిస్తుంది అమ్మవారు.

కాంచీపురం లో మరో విశేషం "సౌందర్యలహరి ఉత్సవం" అని వైశాఖమాస శుక్ల పంచమి నుండి వైశాఖ శుక్ల పౌర్ణమి వరకు 10రోజుల వరకు 'ఆది శంకరాచార్యుల ఉత్సవం' గా జరుగుతుంది. ఆది శంకరుల ఉత్సవ మూర్తిని అమ్మవారి ఎదురుగా గాయత్రీ మంటపం లో ఉంచి శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చెప్తున్నట్టుగా అర్చకస్వామి సౌందర్యలహరిలోని శ్లోకాలను రోజుకు 10చొప్పున చెప్తూ అమ్మవారిని ఆదిశంకరులు పూజిస్తున్నట్టుగా ఉత్సవం చేస్తారు.
ఆది శంకరులే స్వయంగా అమ్మవారి ఎదురుగా "శ్రీచక్రాన్ని" ప్రతిష్టించారు. వారే మొదటి ఆచార్యులు.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)