తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత

Telugu Lo Computer
0


తెలంగాణలో కరోనా నేపథ్యంలో విధించిన  లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.  రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందంటూ వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని క్యాబినెట్ పరిశీలించింది. ఈమేరకు జూన్ 19 వరకు అమలులో ఉన్న లాక్ డౌన్ రేపటి నుండి పూర్తిగా ఎత్తివేత ఎత్తివేయాలని నిర్ణయించింది.

దీంతో అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవను న్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 12న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)