రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ లేఖ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 19 June 2021

రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ లేఖ


దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ  లేఖ రాసింది.  పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో పలు  సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి, దాని ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని సూచించారు. ఆంక్షల సడలింపు అనంతరం కూడా కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని తెలిపారు. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలన్నారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమని వివరించారు. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలంది. 

పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలంది. ఒకవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండగా, మరోవైపు ప్రజలు నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే రెండో దశకు దారితీసిందని పేర్కొంది. 

No comments:

Post a Comment

Post Top Ad