టోల్ ప్లాజాలో అగ్ని ప్రమాదం

 

మంగళగిరి దగ్గర ఉన్న  కాజా టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడు కు చెందినది గా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగలటంతో మంటలు చెలరేగాయి.

టైర్ సమీపంలోని ఆయిల్ ట్యాంక్ కు మంటలు వ్యాపించడం తో మరింత వేగంగా మంటలు వ్యాపించటంతో కుడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ కౌంటర్లు మంటలకు ఆహుతైయ్యాయి. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని, రెండు ఫైరింజనులు  మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని  పోలీసులు తెలిపారు. ప్రస్తుతం టోల్ ప్లాజా నుండి యధావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. 

Post a Comment

Previous Post Next Post