సామెతలు...!!!

* తాయెత్తుకు పిల్లలు పుడితే తానెందకు?

* మొక్కై వంగనిది మానై వంగునా !

* బాల వాక్కు బ్రహ్మ వాక్కు !

* వాన రాకడ ప్రాణపోకడ  !

* గంతకు తగ్గ బొంత  !

* గోరు చుట్టు మీద రోకలి పోటు  !

* కలిమి లేములు కావడి కుండలు  !

* కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు  !

* కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం  !

* కీడెంచి మేలెంచమన్నారు  !

* కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు  !

* నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది  !

* మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు  !

* మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట  !

* నవ్వు నాలుగు విధాలా చేటు  !

Post a Comment

Previous Post Next Post