పంచమ వేదం !

Telugu Lo Computer
0



కల్లా, కపటం తెలియని చదువు రాని  వారు నాటు వైద్యం అని పిలుచుకుంటారు.. 

ఇప్పుడున్న అధునాతనమైన వైద్యానికి మూలం ఈ ఆయుర్వేదమే.. 

కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అధునాతనమైన వైద్య పరికరాలు రావడంతో అమ్మలాంటి ఆయుర్వేదంను పనికిరాని వైద్యంగా పరిగణిస్తున్నారు.. ఇప్పుడు ఏదైతే అధునాతనమైన వైద్యం అంటున్నామో ఆ అల్లోపతి వైద్యంలో ఏ రోగానికైనా తాత్కాలిక ఉపశమనమేగానీ శాశ్వత పరిష్కారం లేదు. అదే ఆయుర్వేదంలో ప్రతీ మొండి వ్యాదికి సైతం శాశ్వత పరిష్కారం ఉంది. కానీ దానికి కాస్త సమయం, పధ్యం అనేవి ఉంటాయి..అంత ఓపిక ఇప్పుడు రోగికి ఉండడం లేదు.  ముఖ్యంగా  ఆయుర్వేదం మీద రోగికి నమ్మకం అనేది లేకుండా చేసి లోకువ గా చేసారు.. వైద్యం మీద నమ్మకం లేకుంటే ఎటువంటి చిన్న వ్యాధి కూడా నయం కాదు. 

1794. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కు బ్రిటీష‌ర్స్ కు మ‌ద్య మూడ‌వ మైసూర్ యుద్దం జ‌రుగుతున్న రోజులు…. బ్రిటీష్ సైనికుల‌కు ఆహార వ‌స్తువుల‌ను తీసుకొని ఓ బండి వెళుతుంది. టిప్పు సైనికులు ఆ బండి న‌డిపేవాడిని ప‌ట్టుకొని రాజు ద‌గ్గ‌రికి తీసుకొచ్చారు. శ‌త్రువుల‌కు స‌హాయం చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణించి…అత‌డి ముక్కును కోసేయ‌మ‌ని ఆర్డ‌ర్ వేశాడు రాజు … అత‌ని ముక్కు తెగింది.! అత‌ని పేరు కోసాజి.! యుద్దం ముగిసింది. బ్రిటీష‌ర్స్ చేతిలో టిప్పు ఓడిపోయాడు… కోసాజి ద‌గ్గ‌రికి ఓ బ్రిటీష్ వైద్యుడు వ‌చ్చి ట్రీట్మెంట్ చేయ‌బోతే…కోసాజి అత‌డిని వారించి త‌న‌ను కుమార్ అనే ఆయుర్వేద వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌మ‌న్నాడు. అంద‌రూ అత‌నికి న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికీ అత‌ను విన‌కుండా..కుమార్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.కుమార్…కోసాజి నుదుటి మీది చ‌ర్మాన్ని తీసి…తెగిన ముక్కును అతికించి కుట్లు వేశాడు. కొన్ని రోజుల త‌ర్వాత నుదుటి చ‌ర్మం నార్మ‌ల్ అయ్యింది. ముక్కు కూడా సెట్ అయ్యింది!ఈ స‌మాచారం తెల్సుకున్న డాక్ట‌ర్…కుమార్ గురించి బ్రిట‌న్ లో ఉన్న జోసెఫ్ అనే డాక్ట‌ర్ కు చెప్పాడు. జోసెఫ్ హుటాహుటిన లండ‌న్ నుండి ఇండియా వ‌చ్చి….కుమార్ వ‌ద్ద ఆ విద్య‌ను నేర్చుకొని బ్రిట‌న్ వెళ్లాడు. కుమార్ కు ఆ విద్య ఎలా వ‌చ్చిందంటే…25000 సంవ‌త్స‌రాల క్రితం శుశ్రుతుడు రాసిన శుశ్రు సంహిత పుస్త‌కం నుండి.! శుశ్రు సంహిత లో ఈ ఫ్లాస్టిక్ స‌ర్జ‌రీ గురించి వివ‌రించ‌బ‌డింది.! దాన్ని ఫాలో అయ్యి కుమార్ కోసాజీ ముక్కును అతికించాడు.. బ్రిటీష్ వాళ్లు ఆ టెక్నాలజీని త‌ర్వాత మ‌రింత డెవ‌ల‌ప్ చేశారు.!

వేదాలను ఔపోసన పట్టిన కొద్దిమందిలో దిండిభట్ల విశ్వధాధ శాస్త్రి దిట్ట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒకచోట పేర్చిన మందుగుండు సామాగ్రి అంతా మాటిమాటికి ప్రేలిపోతుండఢంతో దీనికి పరిష్కారం భారతీయ వేదాలలొ ఉందని తెలుసుకున్న జర్మన్ నాజీ సైన్య నియంత అడాల్ఫ్ హిట్లర్ వేదాలపై పట్టు ఉన్న దిండిభట్ల విశ్వధాధ శాస్త్రి ని భారతదేశం నుండి బలవంతంగా ఎత్తుకొచ్చాడు.. తరువాత శాస్త్రి గారు వారి సమస్యకు పరిష్కారం చూపారు.. అపారమైన ఆయన ప్రజ్ఞా పాటవాలకు అబ్ఫురపోయిధ హిట్లర్ శాస్త్రి గారిని తిరిగి భారతదేశానికి పంపలేదు.. శాస్త్రి గారి సతీమణి గారికి జర్మనీ నుండి ఆమె జీవించినంతకాలం 300 రూపాయలు ప్రతి నెల జీవన భృతి పంపేవారట..! శాస్త్రి గారు కాలం చేశాక ఆయన సేవలకు గుర్తుగా జర్మనీలో శాస్త్రి గారి విగ్రహం చేయించి ప్రతిష్టించారు.  ఈరోజుకు కూడా ఆయన వర్ధంతికి నివాళులు అర్పిస్తారు.

 సుశ్రుత సంహిత ద్వారా వైద్యం నేర్చుకున్న ఆస్ట్రేలియా వారు మెల్ బోర్న్ లో ఆయనకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని చేయించి పెట్టుకున్నారు.. అదీ వారి విశ్వసనీయత! చైనీయులకు వైద్యం నేర్పిన బోధిధర్ముడు మన భారతీయుడు కాదా? ఆయన అవలంబించిన వైద్యం ఆయుర్వేదం కాదా?  మనకు ఇప్పటికీ సుశ్రుతుడు, చరకుడు అంటే తెలియదు, వైద్యానికి అధి దేవత అమృత పాణి ధన్వంతరి అంటే తెలియదు.. మన ప్రాచీన వైద్యానికి పాశ్చాత్యులు జేజేలు పలుకుతుంటే మనమేమో నాటు వైద్యం అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాము.. వారు మన రుషులకు విగ్రహాలు చేసి పూజిస్తుంటే మనం ఆ పంచమ వేదాన్ని చులకన చేస్తున్నాం.. ఆయుర్వేదాన్ని శాస్త్రోక్తంగా అవలంబిస్తే అద్భుతమైన ఫలితాలు ఆవిష్కారమవుతాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)