తెలుసుకుందాం!

Telugu Lo Computer
0


 చద్దన్నం లో పెరుగు కలుపుకొని తినండ్రా అంటే మోటుతనం అంటారు పిజ్జా బర్గర్ జనరేషన్. కాని వాటిలో ఉన్న ప్రో బయాటిక్స్ గురించి మాట్లాడితే పెద్ద పుస్తకమే అవుతుంది.

అదే ఒక రోజు బ్లాక్ ఫంగస్ అని న్యూస్ లో వస్తే ఇదేదో కొత్తది అంటారు, మళ్ళీ వైట్ ఫంగస్ వచ్చింది, ఇంకా ఇంకా చాలా చాలా వస్తాయి. . సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ప్రపంచం లో ఏ డాక్టర్ కి, సైంటిస్ట్ కి ప్రతి మైక్రో ఆర్గానిజం (బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్) గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళకే పూర్తిగా తెలియనప్పుడు మనం తెలుసుకొని ఏం చేస్తాం. అయినా ఎప్పుడో ఒకప్పుడు బూజు పట్టని ఇళ్ళు ఒకటి అయినా ఉంటుందా ఈ ప్రపంచం లో..? మన చుట్టూ మరియూ వాతావరణం లో చాలా ఫంగస్ లు ఉంతాయి. 

అన్నిటిని వదిలేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండ్రా అంటే సరిపోతుంది. మంచి జీవన విధానం అలవర్చుకోండి అంటే సరిపోతుంది.

మన శారీరం లోపల, బయట కొన్ని లక్షల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉంటుంది. ఉండాలి కూడా.

నిజానికి అవి లేకపోతేనే చాలా హానికరం. లాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా, శెకారోమైసిస్ అనే ఫంగస్ అనే కాదు, ఇంకా చాలా అవసరం. కొన్ని ఉపయోకరమైనవి ఉంటాయి.  కొన్ని హానికరమైనవి ఉంటాయి. ఇవన్నీ జీవక్రియలు సక్రమం గా జరగాలంటే అత్యంత అవసరం కూడా.

ఎప్పుడైతే ఇమ్మ్యూనిటి (వ్యాధి నిరోధక శక్తి) తగ్గుతుందో అప్పుడు ఈ హానికరమైన వాటి ప్రభావం కనిపిస్తుంది. అందుకే బ్లాక్, వైట్, గ్రీన్, యెల్లో ఫగస్ ల సంగతి పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి, మంచి జీవన విధానాన్ని అలవరచుకోవాలి.

ఎవరికైతే కొంచెం భయం అనిపిస్తుందో, జస్ట్ విటమిన్ టెస్ట్స్ మరియీ యాంటీ బాడీస్ టెస్ట్ చేయించుకొని నేచరల్ పద్ధతిలో వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రత్యేక పరిస్థితులు కాబట్టి కొన్ని రోజులు విటమిన్ C & D, జింక్, B-12 సప్లిమెంట్స్ వాడండి అవసరం అనుకుంటేనే లేదా నేచరల్ పద్ధతి నే బెస్ట్.

డాక్టర్స్, సైంటిస్ట్స్ లు మాట్లాడే మాటలు ఏవీ కొత్తవి కావు, ఉన్న వాటికే సైంటిఫిక్ పదాలు అంతే.

మన అందరికీ టమాటా తెలుసు, అప్పుడప్పుడు తింటాం కూడా. కాని దాని సైంటిఫిక్ పేరు "లైకోపర్సికం ఎస్కులెంటా".  వాళ్ళు మాట్లాడే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లు కూడా ఇంతే. మనలో, మన చుట్టూ నిత్యం ఉండేవే ఇవన్నీ. 

Post a Comment

0Comments

Post a Comment (0)